| KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO |
| The Temple is significant because of the two Shiva Lingas |
|
| Contact:Pujalu 0 9491017012, 0 9491018012 |
|
|
|
|
|
|
|
|
|
KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO
The Temple is significant because of the two Shiva Lingas |
WELCOME TO KALESHWARAM
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయము కాళేశ్వరము గ్రామము తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండము లో వివరించ బడిన అతి ప్రాచీనమైన క్షేత్రం లో ఒకటి.
|
| |
| |
Untitled Document
| CONTACT US |
Pujalu, Shashwatha Pujalu and Annadanam
పూజలు, శాశ్వత పూజలు మరియు అన్నదానం గురించిన సమాచారం కొరకు +919441008859 |
| |
| రూములు మరియు దేవాలయము ఇతర సమాచార ము గురించి 9121590439 |
| |
అష్ట తీర్థములు
కాళేశ్వరము క్షేత్రమునందుగల అష్ట తీర్ధములు ప్రాచీన కాలమునుండి విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. అవి.
1. జ్ఞాన తీర్థము,
2. వాయస తీర్థము (పక్షి తీర్థము),
3. నృసింహ తీర్థము,
4. చిత్సుఖ తీర్థము,
5. బ్రహ్మ తీర్థము,
6. హనుమ తీర్థము,
7. వ్యాస తీర్థము,
8. సంగమ తీర్థము
అనునవి మిక్కిలి పవిత్రతను మరియు
ప్రాధాన్యతను కలిగియున్నవి |
|
| ~~~ చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్యహ్ శుభమ్ భవతు ~~~ |
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమై దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందినది. పర్వ దినములలో తెలంగాణ. నుండే కాకుండ ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ముందుగా యమ (కాళేశ్వర) లింగాన్ని,తర్వాత ముక్తీశ్వర లింగాన్ని అభిషేకిస్తూ, స్పర్శ దర్శనం చేసుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని కాళేశ్వర ఖండం లో వివరించ బడింది. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని . ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని స్కంధ పురాణము లోని కాళేశ్వర ఖండము లో చెప్పబడింది
త్రివేణి సంగమం
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యా వందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునే వారని స్కంధ పురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు స్వామి వార్ల ఆరాధ్యులుగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునే వారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరుగగా తిరిగి 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా 2022లో పుష్కరాలు వస్తాయి, సరస్వతి నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి వస్తాయి. మరల సరస్వతి నదికి 2026 లో అంత్య పుష్కరాలు వస్తున్నాయి
స్థల పురాణం – విశిష్టత
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.
| ~~~ Kaleshwaram lo chudavalasina pradeshalu ~~~ |
| |
|
|
1.Sri Kaleshwara muktheeshwar |
| |
|
|
2.Shubhananda (Parvathi ) ammavari aalayam |
| |
|
|
3.Saradhwathi ammavari aalaya |
| |
|
|
5.Sri surya bhagavanudi aalaya |
| |
|
|
6.Sri valli devasena sametha subrahmanya swami vari aalayam |
| |
|
|
7.Aadhi muktheeshwara swami |
| |
|
|
8.Sri sangameshwara swami vari aalayam |
| |
|
|
9. Sri datthatreya swami vari |
| |
|
|
10.Sri sita lakshmana hanuma sametha ramalayam
11.Gundam cheruvu
12.Sri lakshmi narasimha swami aalayam |
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
| |
Design & Developed By :  |
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions |
| Contact us: PH 7036241442 |
Copyrights © 2026 Reserved to www.kaleshwaram.co.in Developed By www.CreativeMindSoft.in
|
| , pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.vavpages.com | http://www.vavpages.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Cheapest Website Quick Website Best Ready made Web |
|